ఈ నెల 20 నుంచి మునుగోడులోనే ఉంటా: రేవంత్ రెడ్డి

15-08-2022 Mon 18:16
  • తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మునుగోడు
  • కాంగ్రెస్ నేతలెవరూ పార్టీ మారొద్దన్న రేవంత్
  • ఒక్క ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ దే అధికారమని వ్యాఖ్య
Will be in Munugodu from August 20 says Revanth Reddy
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజక వర్గానికి ఉప ఎన్నిక రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి సత్తా చాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలోని సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లను కొంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ కూడా పార్టీ మారొద్దని కోరారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా నిలబడదామని చెప్పారు. ఒక్క ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ దే అధికారమని చెప్పారు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. ఈ నెల 20 నుంచి తాను మునుగోడులోనే ఉంటానని చెప్పారు.