రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్, చంద్రబాబు

15-08-2022 Mon 17:57
  • నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం
  • ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్
  • సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్
  • రాజ్ భవన్ లో సాదర స్వాగతం
CM Jagan and opposition leader Chandrababu attends At Home
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందుకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. అటు, విపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కేశినేని నాని, అశోక్ బాబు, గద్దె రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు. ఏపీ సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

ఎట్ హోమ్ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు గవర్నర్ హరిచందన్ సాదర స్వాగతం పలికారు. జాతీయ గీతాలాపనతో ఎట్ హోమ్ కార్యక్రమం షురూ అయింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరినీ గవర్నర్ స్వయంగా పలకరించి, స్వాతంత్ర్యోద్యమ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.