కొత్త పాయింట్ ను టచ్ చేస్తున్న 'రంగ రంగ వైభవంగా'

15-08-2022 Mon 17:19
  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'రంగ రంగ వైభవంగా'
  • వైష్ణవ్ తేజ్ సరసన నాయికగా కేతిక శర్మ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • సెప్టెంబర్ 2వ తేదీన సినిమా విడుదల
Rangamarthanda Movie Update
వైష్ణవ్ తేజ్ హీరోగా .. ఆయన మూడో సినిమాగా 'రంగ రంగ వైభవంగా' సినిమా రూపొందింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు ముస్తాబై చాలా రోజులైంది. సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయడం వలన కొంత ఆలస్యమైంది. సెప్టెంబర్ 2వ తేదీని ఈ సినిమా విడుదల తేదీగా ఫిక్స్ చేశారు. 

ఈ కథ కొత్త పాయింట్ తో నడుస్తుందని సమాచారం. 'అహం' అనే ఒక పాయింట్ ను టచ్ చేస్తూ ఈ లవ్ స్టోరీ కొనసాగుతుందని అంటున్నారు. అయితే ఎవరి అహంభావం చుట్టూ ఈ కథ తిరుగుతుంది? దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అనేది సస్పెన్స్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.

వైష్ణవ్ తేజ్ జోడీ కట్టిన కేతిక శర్మకి కూడా ఇది మూడో సినిమానే. గతంలో ఆమె చేసిన రెండు సినిమాలు గ్లామర్ పరంగా మంచి మార్కులను తెచ్చిపెట్టాయిగానీ, సక్సెస్ లను మాత్రం ఇవ్వలేదు. అందువలన ఈ సినిమాపైనే ఆమె ఆశలు పెట్టుకుంది. పవన్ పుట్టినరోజున ఈ సినిమా రిలీజ్ అవుతుండటాన్ని మెగా ఫ్యాన్స్ ప్రత్యేకంగా భావిస్తున్నారు.