రేపు అచ్యుతాపురంలో సీఎం జగన్ పర్యటన

15-08-2022 Mon 17:07
  • ఉదయం 10.20 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం జగన్
  • ఏటీసీ టైర్ల పరిశ్రమ తొలి యూనిట్ కు ప్రారంభోత్సవం
  • అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి నివాసానికి సీఎం
CM Jagan will inaugurate ATC Tyres unit in Atchyutapuram
ఏపీ సీఎం జగన్ రేపు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10.20 గంటలకు సీఎం జగన్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురం బయల్దేరి, అక్కడ ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించనున్నారు. జపాన్ కు చెందిన యోకహామా గ్రూప్ నకు చెందిన ఏటీసీ టైర్ల పరిశ్రమను ఇక్కడి సెజ్ లో ఏర్పాటు చేశారు. రూ.2,350 కోట్ల వ్యయంతో ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఇందులో తొలి యూనిట్ సిద్ధం కాగా, సీఎం జగన్ రేపు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 

ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ నివాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే వాసుపల్లి తనయుడు సూర్య వివాహం రాశి అనే యువతితో జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వాసుపల్లి నివాసంలో నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు విజయవాడ బయల్దేరనున్నారు.