లోకేశ్ కనగరాజ్ తో విజయ్ దేవరకొండ?

15-08-2022 Mon 16:43
  • 'లైగర్' ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ 
  • 'విక్రమ్' గురించి ప్రస్తావించిన హీరో 
  • లోకేశ్ టేకింగ్ పట్ల ప్రశంసలు 
  • ఆయన కాల్ కోసం వెయిటింగన్న విజయ్ దేవరకొండ
Vijay Devarakonda in Lokesh Kankagaraj movie
విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లోకేశ్ కనగరాజ్ ప్రస్తావన తీసుకుని వచ్చాడు.

లోకేశ్ కనగరాజ్ గురించి విన్నాను. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన 'విక్రమ్' సినిమాను చూశాను. ఆ సినిమాను చూస్తూ నన్ను నేను మరిచిపోయాను. మొదటి నుంచి చివరివరకూ ఆ సినిమా అలా కూర్చోబెట్టేసింది. లోకేశ్ కనగరాజ్ ఆ సినిమాను చాలా అద్భుతంగా తీశాడు. అందువల్లనే దానికి ఆ స్థాయి ఆదరణ లభించింది. 

లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. త్వరలోనే ఆయన నుంచి నాకు కాల్ వస్తుందని అనుకుంటున్నాను" అన్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న లోకేశ్ నుంచి విజయ్ కి ఎప్పుడు కాల్ వస్తుందన్నది చూడాలి మరి. ఇక ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ 'ఖుషి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.