Mukesh Ambani: ముఖేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి బెదిరింపు కాల్స్.. ఒకరి అరెస్టు

Threat calls  to Mukesh Ambani
  • ప్రాణ హాని తలపెడతామంటూ బెదిరింపు కాల్స్
  • రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కు ఫోన్లు
  • ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు

ప్రాణ హాని తలపెడతామంటూ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి ఈరోజు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్ కి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. మొత్తం ఎనిమిది సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్ లో రిలయన్స్ ఫౌండేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఒకేరోజు ఎనిమిది కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ... రిలయన్స్ ఫౌండేషన్ నుంచి ఫిర్యాదు అందిందని చెప్పారు. మరోవైపు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై వెస్ట్ సబర్బ్ ప్రాంతంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ముఖేశ్ అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో నింపిన స్కార్పియో వాహనం పార్క్ చేసి ఉండటం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News