రాజ్ భవన్ లో 'ఎట్ హోమ్' కార్యక్రమానికి చంద్రబాబు... సీఎం జగన్ తో ఒకే వేదిక పంచుకోనున్న విపక్షనేత

15-08-2022 Mon 14:59
  • రాజ్ భవన్ లో తేనీటి విందు
  • టీడీపీ అధినాయకత్వానికి గవర్నర్ నుంచి ఆహ్వానం
  • స్వయంగా హాజరుకానున్న టీడీపీ అధినేత 
Chandrababu will attend At Home program at Raj Bhavan
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ 'ఎట్ హోమ్' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కూడా ఆహ్వానం అందింది. టీడీపీ విపక్షంలోకి వచ్చాక ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు వస్తుండడం ఇదే ప్రథమం. అయితే, నేడు తొలిసారిగా చంద్రబాబు స్వయంగా హాజరుకానుండడంతో అందరి దృష్టి రాజ్ భవన్ వైపు మళ్లింది. 'ఎట్ హోమ్' కార్యక్రమంలో భాగంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ సాయంత్రం రాజ్ భవన్ లో తేనీటి విందు ఇస్తున్నారు. 

ఇటీవల చంద్రబాబు ఢిల్లీలో మోదీతో ప్రత్యేకంగా మాట్లాడిన సమయంలోనూ మీడియా దృష్టి అటువైపే మళ్లింది. చాన్నాళ్ల తర్వాత మోదీతో చంద్రబాబు మాట్లాడిన క్షణాలను పలు పత్రికలు, చానళ్లు హైలైట్ చేశాయి. ఇప్పుడు చంద్రబాబు ఏపీ రాజ్ భవన్ లో సీఎం జగన్ తో కలిసి ఒకే వేదిక పంచుకోనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.