మునుగోడులో గెలిచేది మేమే... బీజేపీకి మూడో స్థానమే!: మంత్రి జగదీశ్ రెడ్డి

14-08-2022 Sun 17:07
  • నల్గొండ జిల్లాలో మంత్రి పర్యటన
  • ఈడీ పేరుచెబితే భయపడేది లేదని వెల్లడి
  • కేసీఆర్ ఎవరికీ లొంగే రకం కాదని స్పష్టీకరణ
  • వామపక్షాలు తమతో కలిసి రావాలని పిలుపు
Jagadish Reddy says TRS will win IN Munugodu
తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి నేడు నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ఉద్ఘాటించారు. మునుగోడులో బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని ఎద్దేవా చేశారు. ఈడీ పేరు చెప్పి భయాందోళనలకు గురిచేయాలనుకుంటున్నారని, ఈడీ బోడీలకు భయపడే ప్రసక్తేలేదని అన్నారు. ఈడీని బీజేపీ తన జేబు సంస్థగా మార్చుకుందని విమర్శించారు. కేసీఆర్ ఎవరికీ లొంగే రకం కాదని అన్నారు. 

బీజేపీ దుర్మార్గాలను బయటపెట్టే సత్తా సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఈ పోరాటంలో వామపక్షాలు తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీపీఎం, సీపీఐ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.