దాదాపు 30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

14-08-2022 Sun 15:51
  • 90వ దశకంలో కశ్మీర్ లో తీవ్ర హింసాత్మక పరిస్థితులు
  • మూతపడిన సినిమా హాళ్లు
  • కశ్మీరీలకు దూరమైన సినిమా వినోదం
  • తాజాగా మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న ఐనాక్స్
  • వచ్చే నెల నుంచి సినిమా ప్రదర్శనలు
After thirty years a cinema theater will be started soon in Kashmir
కశ్మీర్ లో 90వ దశకంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రజలకు సినిమా వినోదం దూరమైంది. ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందోనన్న భయాందోళనల కారణంగా సినిమా థియేటర్లు మూసివేశారు. అయితే, మునుపటితో పోల్చితే ఇప్పుడక్కడ ఓ మోస్తరు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కశ్మీరీ ప్రజలకు సినిమా వినోదం మళ్లీ చేరువ కానుంది. ఐనాక్స్ సంస్థ శ్రీనగర్ లో మల్టీప్లెక్స్ నిర్మిస్తోంది. ఇది వచ్చే నెలలో ప్రారంభం కానుంది. 

ఈ మల్టీప్లెక్స్ లో మూడు స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక సౌండ్ సిస్టమ్, సౌకర్యవంతమైన సీటింగ్ తో ఈ థియేటర్ ను తీర్చిదిద్దుతున్నారు. ఈ మల్టీప్లెక్స్ సీటింగ్ సామర్థ్యం 520 సీట్లు. ఇందులో ఫుడ్ కోర్టులు, చిన్నారులు ఆడుకునేందుకు మెషీన్ టాయ్స్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు.