సరికొత్త హెయిర్ స్టయిల్ తో మహేశ్ బాబు... ఫొటో ఇదిగో!

14-08-2022 Sun 15:33
  • ఫొటో పంచుకున్న మహేశ్ బాబు
  • షార్ప్ లుక్స్ తో ఆకట్టుకునేలా ఉన్న పిక్
  • అభిమానుల నుంచి విశేష స్పందన
Mahesh Babu with new hairstyle
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గ్లామర్ కు పర్యాయపదంలా నిలుస్తారు. ఆయన వయసును అంచనా వేయడం చాలా కష్టం. ఎప్పుడూ ఉల్లాసంగా కనిపించే మహేశ్ బాబు స్లిమ్ గా, ఫిట్ గా ఉండేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు, విరామ సమయాల్లో కొత్త హెయిర్ స్టయిల్స్ ప్రయత్నిస్తుంటారు. తాజాగా, సరికొత్త లుక్ లో దర్శనమిచ్చారు. పైకి దువ్వీ దువ్వనట్టుగా వదిలేసిన జుట్టు, అక్కడక్కడ తెల్ల జుట్టు, పల్చటి గడ్డం, షార్ప్ లుక్స్ తో డిఫరెంట్ గా కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోను మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్వయంగా పంచుకున్నారు. ఈ కొత్త రూపును ఇష్టపడుతున్నానంటూ తన ఫొటోపై కామెంట్ చేశారు. 

ఈ కొత్త హెయిర్ స్టయిల్ ను డిజైన్ చేసింది సెలబ్రిటీ స్టయిలిస్ట్ అనీషా జైన్ కాగా, స్టయిలింగ్ చేసింది ప్రఖ్యాత హెయిర్ డ్రెస్సర్ ఆలిమ్ హకీమ్. ఇక, ఈ ఫొటోను క్లిక్ మనిపించింది ప్రముఖ ఫోటోగ్రాఫర్ జతిన్ కంపానీ. దీనికంతటికీ సూత్రధారిగా నిలిచింది నమ్రతా శిరోద్కర్. ఈ ఫొటోకు కొన్ని గంటల్లోనే వేల లైకులు, రీట్వీట్లు రావడం విశేషం.