విజయనగరం జిల్లాలో దొరికిన లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు!

14-08-2022 Sun 15:14
  • రాజాంలో పాత ఇంట్లో ఇనుప లాకర్ లభ్యం
  • యజమాని, కూలీల మధ్య వాగ్వాదం
  • లాకర్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • పోలీసుల సమక్షంలో లాకర్ తెరిచిన వైనం
Only coins has been found in old iron locker
విజయనగరం జిల్లా రాజాంలోని కంచర వీధిలో ఓ పాత ఇంటిని కూలగొడుతుండగా, గోడలో ఓ ఇనుప లాకర్ లభ్యం కావడం తెలిసిందే. ఆ లాకర్ మాకు చెందుతుందంటే మాకు చెందుతుందంటూ యజమాని, కూలీల మధ్య వాగ్వాదం చెలరేగగా, పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేసి ఆ లాకర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లాకర్ లో గుప్త నిధులు ఉండొచ్చన్న ప్రచారం జరిగింది. 

తాజాగా పోలీసుల సమక్షంలో ఆ లాకర్ ను తెరవగా, అందరూ ఆశ్చర్యపోయారు. అందులో చిన్న నాణేలు తప్ప మరే విలువైన వస్తువులు లేవు. ఏవో కొన్ని పాత కాగితాలు లభ్యమయ్యాయి. ఆ లాకర్ లో నిధినిక్షేపాలు ఉంటాయోమో చూద్దామని వచ్చిన జనం నిరాశకు లోనయ్యారు.