రూ. 40 లక్షలతో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని సిద్ధం చేసిన బాలకృష్ణ.. సేవలకు రెడీ!

14-08-2022 Sun 08:50
  • హిందూపురం ప్రజలకు ఉచిత వైద్య సేవలు 
  • ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో సేవలు అందించనున్న రథం
  • వాహనంలో వైద్యుడు, నర్సు, ఫార్మసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, వైద్య సిబ్బంది
Hindupur MLA Balakrishna readied NTR Free Medical Services Vehicle
తన నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు హిందూపురం ఎమ్మెల్యే తయారు చేసిన ‘ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం’ సిద్ధమైంది. నిన్న ఇది హిందూపురం చేరుకుంది. బాలకృష్ణ త్వరలోనే దీనిని ప్రారంభించనున్నారు. 200కుపైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, మాతాశిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన వంటి సదస్సులను ఈ రథం ద్వారా నిర్వహిస్తారు. 

ఈ వాహనంలో ఓ వైద్యుడు, నర్సు, ఫార్మసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, వైద్య సిబ్బంది, మందుల కౌంటర్ ఉంటుంది. అక్కడే నయం చేయగల వ్యాధులకు రథంలోనే చికిత్స అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. అంతకుమించిన వైద్య సేవలకు ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో ఈ రథం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తారు.