ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో చంద్ర‌బాబు... రాఖీలు క‌ట్టిన తెలంగాణ తెలుగు మ‌హిళ‌లు

13-08-2022 Sat 21:47
  • ఏపీలోనే ఎక్కువ‌గా ఉంటున్న చంద్ర‌బాబు
  • వారాంతాల్లో హైద‌రాబాద్ వ‌స్తున్న వైనం
  • శ‌నివారం హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చిన వైనం
tdp chief chandrababu visits ntr trust bhavan on satur day in hyderabad
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు శ‌నివారం హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు వ‌చ్చారు. రాఖీ ప‌ర్వ‌దినం త‌ర్వాత ఆయ‌న పార్టీ కార్యాల‌యానికి రాగా... తెలంగాణ పార్టీ శాఖ‌కు చెందిన మ‌హిళా నేత‌లు ఆయ‌న‌కు రాఖీలు క‌ట్టారు. ఇటీవ‌లి కాలంలో అధిక భాగం ఏపీలోనే ఉంటున్న చంద్ర‌బాబు... వారాంతాల్లో మాత్ర‌మే హైద‌రాబాద్ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చిన ఆయ‌న ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు వ‌చ్చారు. చంద్ర‌బాబు రాక సంద‌ర్భంగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు పెద్ద ఎత్తున తెలంగాణ పార్టీ శాఖ శ్రేణులు వ‌చ్చాయి.