తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... ఈ నెల 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు

13-08-2022 Sat 21:45
  • నిండిపోయిన వైకుంఠం క్యూకాంప్లెక్స్
  • సర్వదర్శనానికి 30 గంటల సమయం
  • కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
  • సామాన్య భక్తులకే ప్రాధాన్యత అన్న వైవీ
Huge rush in Tirumala shrine
ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వరకు సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత నిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సెలవులు, పెళ్లి ముహూర్తాల వల్ల కొండపై భక్తుల రద్దీ పెరిగిందని వివరించారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.