సదా, ఆర్యన్ రాజేశ్ ల 'హలో వరల్డ్'... జీ5 ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్

13-08-2022 Sat 19:59
  • ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్
  • హైదరాబాదులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హాజరైన విష్వక్సేన్, నేహా శెట్టి
  • ట్రైలర్ రిలీజ్ చేసిన హరీశ్ శంకర్
Hello World web series streaming starts in ZEE5
విలక్షణమైన కంటెంట్ కు పెద్దపీట వేసే జీ5 ఓటీటీలో మరో కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. సదా, ఆర్యన్ రాజేష్ నటించిన 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఆగస్టు 12న ప్రారంభమైంది. దీని ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టే యువ టెక్కీల మనోభావాలను అన్వేషించే డ్రామాగా ఈ 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ ను అభివర్ణించవచ్చు. 

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక కొణిదల, జీ5 భాగస్వామ్యంతో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు శివసాయి వర్ధన్ జలదంకి దర్శకుడు. కాగా 'హలో వరల్డ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని టి. హబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యువ హీరో హీరో విష్వక్సేన్, హీరోయిన్ నేహా శెట్టి  మరియు జీ5 టీమ్ మెంబర్స్ హాజరయ్యారు.