రేపు ట్యాంక్ బండ్‌పై సండే ఫన్‌డే.. సాయంత్రం నుంచి రాత్రి దాకా ట్రాఫిక్ ఆంక్ష‌లు

13-08-2022 Sat 19:58
  • క‌రోనాకు ముందు ట్యాంక్‌బండ్‌పై ప్ర‌తి ఆదివారం స‌న్‌డే ఫ‌న్‌డే వేడుక‌లు
  • క‌రోనాతో ర‌ద్దయిన వేడుక‌లు
  • తాజాగా రేప‌టి నుంచి స‌న్‌డే ఫ‌న్‌డే వేడుక‌లు
  • సాయంత్రం 4 నుంచి 10 గంట‌ల దాకా ట్యాంక్‌బండ్‌పై వాహ‌నాల రాక‌పోక‌లు బంద్‌
sunday funday celebrattions on tankbund tomorrow
క‌రోనా విజృంభ‌ణ‌కు ముందు హైద‌రాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సంద‌డిగా సాగిన సండే ఫ‌న్‌డే వేడుక‌లు మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మొద‌లవుతున్నాయి. ఈ సెల‌బ్రేష‌న్స్ రేప‌టి నుంచే మొద‌లు కానున్నాయి. సెల‌వు దినం ఆదివారం నాడు క్ర‌మం త‌ప్ప‌కుండా ట్యాంక్‌బండ్‌పై గతంలో స‌న్‌డే ఫ‌న్‌డే పేరిట వేడుక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనా నేప‌థ్యంలో ఈ వేడుక‌లు ర‌ద్దు కాగా... రేపటి (ఆదివారం) నుంచి మ‌ళ్లీ మొద‌లుకానున్నాయి. 

రేపు సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల దాకా ట్యాంక్‌బండ్‌పై స‌న్‌డే ఫ‌న్‌డే వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుక‌ల నేప‌థ్యంలో ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల దాకా వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు శ‌నివారం ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాల‌నుకునే వారు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు.