ఖ‌జుర‌హో వీధుల్లో బుల్లెట్ బండిపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి... ఫొటోలు ఇవిగో

13-08-2022 Sat 16:16
  • మ‌ధ్యప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌లో కిష‌న్ రెడ్డి
  • తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వైనం
  • బుల్లెట్ ఎక్కి ఖ‌జుర‌హో వీధుల్లో సంచ‌రించిన మంత్రి
union minister kishan reddy spotted on bullet bike in Tiranga Bike Rally at Khajuraho
కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి శ‌నివారం మ‌ధ్యప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న నేప‌థ్యంలో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరిట కేంద్ర ప్ర‌భుత్వం భారీ కార్య‌క్ర‌మాల‌కు తెరదీసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 13 (శ‌నివారం) నుంచి 15 (సోమ‌వారం) వ‌ర‌కు దేశ ప్ర‌జ‌లంతా త‌మ ఇళ్ల‌పై జాతీయ జెండాల‌ను ఎగుర‌వేయాలంటూ 'హ‌ర్ ఘ‌ర్ తిరంగా' పేరిట ప్రధాని పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

అంతేకాకుండా హ‌ర్ ఘ‌ర్ తిరంగాలో బాగంగా శ‌నివారం దేశవ్యాప్తంగా తిరంగా బైక్ ర్యాలీకి కూడా కేంద్రం పిలుపునిచ్చింది. ఈ తిరంగా బైక్ ర్యాలీలో పాలుపంచుకునే నిమిత్తం మ‌ధ్యప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కిష‌న్ రెడ్డి... ఆ రాష్ట్రంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రం ఖ‌జుర‌హో వెళ్లారు. చారిత్ర‌క ప‌ట్ట‌ణంలో బీజేపీ శ్రేణులు, స్థానిక ప్ర‌జ‌ల‌తో కలిసి ఆయ‌న బైక్ ర్యాలీలో పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బుల్లెట్ బండి ఎక్కి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.