Congress: మ‌రోమారు క‌రోనా బారిన ప‌డ్డ సోనియా గాంధీ

congress chief sonia gandhi tests possitive for corona once again
  • గ‌తంలో ఓ ద‌ఫా కరోనా బారిన ప‌డ్డ కాంగ్రెస్ చీఫ్‌
  • పోస్ట్ క‌రోనా ఇబ్బందులతో ఆసుప‌త్రిలో చికిత్స‌
  • 3 రోజుల పాటు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సోనియా
  • తాజాగా క‌రోనాతో ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన నేత‌
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మ‌రోమారు క‌రోనా బారిన ప‌డ్డారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు ముందు క‌రోనా బారిన ప‌డిన సోనియా గాంధీ...పోస్ట్ క‌రోనా కార‌ణంగా కొన్ని రోజుల పాటు ఆసుప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. పోస్ట్ క‌రోనా ఇబ్బందుల నుంచి పూర్తిగా కోలుకున్న త‌ర్వాతే ఆమె ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

తాజాగా శ‌నివారం మ‌రోమారు సోనియాలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోగా... ఆమెకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె త‌న ఇంటిలోనే ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవ‌లే 3 రోజుల పాటు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సోనియా గాంధీ... పార్టీ నేత‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె క‌రోనా బారిన ప‌డ‌టం గ‌మ‌నార్హం.
Congress
Sonia Gandhi
Corona Virus

More Telugu News