మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోంది: పినరయి విజయన్

13-08-2022 Sat 10:37
  • గవర్నర్, కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటూ తమను టార్గెట్ చేస్తోందన్నా సీఎం  
  • అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటోందని ఆరోపణ 
  • ఇలాంటి చర్యలను కేరళ ప్రజలు సహించరని వ్యాఖ్య 
Centre trying to disturb our government says Pinarayi Vijayan
కేరళలోని తమ లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కుట్రలకు పాల్పడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్ తో పాటు ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని తమ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుందని అన్నారు. 

కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ బోర్డు (కేఐఐఎఫ్బీ) నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇలాంటి చర్యలను కేరళ ప్రజలు సహించరని అన్నారు. కేఐఐఎఫ్బీ ఆర్థిక కార్యకలాపాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈడీ ఇటీవల రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి టీఎం థామస్ కు నోటీసులు ఇచ్చింది. వీటన్నింటి నేపథ్యంలో కేంద్రంపై విజయన్ మండిపడ్డారు.