మాంటినిగ్రోలో దారుణం.. వీధిలో యథేచ్ఛగా దుండగుడి కాల్పులు.. 11 మంది మృతి

13-08-2022 Sat 09:35
  • ఇంట్లో గొడవపడి వీధిలోకి వచ్చి కాల్పులు
  • మృతుల్లో ఇద్దరు చిన్నారులు
  • పోలీసుల కాల్పుల్లో నిందితుడి హతం
Gunman kills 11 after family dispute in Montenegro
యూరప్‌ దేశమైన మాంటినిగ్రోలోని సెంటెంజీ నగరంలో ఓ వ్యక్తి (34) కాల్పులతో విరుచుకుపడ్డాడు. వీధిలోకి వచ్చి దారినపోతున్న వారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు.

కాగా, కాల్పులు జరపడానికి ముందు నిందితుడు కుటుంబ సభ్యులతో గొడవపడినట్టు తెలుస్తోంది. అనంతరం ఆగ్రహంతో వీధిలోకి వచ్చి కాల్పులకు తెగబడ్డాడు. ఇదిలావుంచితే, మెక్సికోలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 11 మంది మృతి చెందారు. జైలులో జరిగిన ఓ ముఠా గొడవల్లో తొలుత ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన తర్వాత పక్కనే ఉన్న సివుదాద్ జువారెజ్‌లోని ముఠాలు 9 మందిని హతమార్చాయి.