Boris Johnson: బోరిస్ జాన్సన్ నా ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించడం లేదు: రిషి సునాక్

Boris Johnson has not returned my calls says Rishi Sunak
  • ప్రధాని రేసులో వెనకబడి పుంజుకున్న రిషి సునాక్
  • పార్టీ గేట్ కుంభకోణంపై విచారణ ప్రభుత్వ ప్రక్రియ కాదని స్పష్టీకరణ
  • తాను ప్రధాని అయ్యాక స్వతంత్ర సలహాదారుడిని నియమిస్తానన్న రిషి
బ్రిటన్ ప్రధాని రేసులో తొలుత వెనకబడి ఆ తర్వాత పుంజుకున్న భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రచారంలో భాగంగా చర్చల్లో పాల్గొంటున్నారు. ఇంగ్లండ్‌లోని చెల్టెన్‌హామ్‌లో తాజాగా టోరీ సభ్యులతో చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బోరిస్ జాన్సన్ ‘పార్టీ గేట్’ కుంభకోణంపై జరుగుతున్న పార్లమెంటరీ విచారణపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది పూర్తిగా పార్లమెంటరీ ప్రక్రియ అని, ప్రభుత్వ ప్రక్రియ కానే కాదని స్పష్టం చేశారు. కామన్స్ ప్రివిలెజెస్ కమిటీలోని ఎంపీలను తాను గౌరవిస్తానన్నారు. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారని రిషి చెప్పుకొచ్చారు.

వ్యక్తిగతంగా ఉన్నత ప్రమాణాలు పాటించే తాను ప్రధాని అయిన వెంటనే మంత్రివర్గ ప్రయోజనాల కోసం స్వతంత్ర సలహాదారుడిని నియమిస్తానన్నారు. విశ్వాసం, చిత్తశుద్ధి, మర్యాద వంటివి రాజకీయ ఆత్మకు సంబంధించిన అంశాలని పేర్కొన్నారు. కాగా, రిషి సునాక్‌కు పోటీగా లిజ్ ట్రస్ బరిలో ఉన్నారు.
Boris Johnson
Rishi Sunak
Britain

More Telugu News