4కే, డాల్బీ అట్మోస్ హంగులతో మళ్లీ వస్తున్న పవన్ కల్యాణ్ 'జల్సా'

12-08-2022 Fri 21:16
  • పవన్, త్రివిక్రమ్ కాంబోలో జల్సా
  • 2008లో రిలీజై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం
  • ఆధునిక టెక్నాలజీతో మళ్లీ రిలీజ్
  • సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు
  • అదే రోజు రిలీజ్ అవుతున్న జల్సా
All new Jalsa releases again with 4K and Dolby Atmos technology
పద్నాలుగేళ్ల కిందట పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా చిత్రం సూపర్ హిట్టయింది. సంజయ్ సాహుగా పవన్ కల్యాణ్ అభిమానులను అలరించిన ఆ చిత్రంలో ఇలియానా కథానాయిక. గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. కాగా, పవర్ స్టార్ అభిమానులకు పండుగలా జల్సా మరోసారి రిలీజ్ అవుతోంది. 

ఈసారి లేటెస్ట్ టెక్నాలజీతో హంగులు అద్దుకున్న జల్సా ప్రేక్షకుల ముందుకువస్తోంది. జల్సా చిత్రాన్ని 4కే టెక్నాలజీతో రీ-మాస్టర్ చేశారు. అంతేకాదు, అద్భుతమైన శబ్దనాణ్యతను అందించే డాల్బీ అట్మోస్ పరిజ్ఞానాన్ని జోడించారు. సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త జల్సా థియేటర్లలో రిలీజ్ కానుంది.