తెలంగాణ‌లో ఒక పార్ల‌మెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామ‌కం... జాబితా ఇదిగో

12-08-2022 Fri 20:19
  • క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంటు పార్టీ అధ్య‌క్షుడిగా వంచె శ్రీనివాస్ రెడ్డి
  • సిరిసిల్ల ఇంచార్జీగా అవునురి ద‌యాక‌ర్ రావు
  • జాబితాను విడుద‌ల చేసిన బ‌క్క‌ని న‌ర్సింహులు
ttdp chief bakkani narsimhulu appoints one parliament and assembly incharges
తెలంగాణ‌లో ఓ పార్ల‌మెంటు, 4 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీల‌ను నియ‌మిస్తూ తెలుగు దేశం పార్టీ శుక్ర‌వారం నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేర‌కు పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బ‌క్క‌ని న‌ర్సింహులు ఈ నియామ‌కాల‌ను ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ పార్టీ అధ్య‌క్షుడిగా వంచె శ్రీనివాస్ రెడ్డి నియ‌మితుల‌య్యారు.

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జీలుగా గ‌డ్డి ప‌ద్మావ‌తి (కంటోన్మెంట్‌), రాగిప‌ణి ప్ర‌వీణ్ కుమార్ అలియాస్ బిల్డ‌ర్ ప్ర‌వీణ్ (అంబ‌ర్‌పేట‌), రామిని హ‌రీశ్ (జ‌న‌గాం), అవునురి ద‌యాకర్ రావు (సిరిసిల్ల‌)లు నియ‌మితుల‌య్యారు.