జాతీయ మహిళా కమిషన్ స్పందించినా.. జగన్ స్పందించడం లేదు: టీడీపీ నేత నాగుల్ మీరా

12-08-2022 Fri 19:15
  • డర్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను వెనకేసుకొస్తున్నారన్న మీరా 
  • మహిళల మనోభావాల కంటే డర్టీ ఎంపీనే ఎక్కువయ్యారా? అంటూ ప్రశ్న 
  • జగన్ వైఖరి వల్ల మాఫియాలు, కిరాతకులు చెలరేగిపోతున్నారని ఆరోపణ 
Nagul Meera fires on Jagan
డర్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ ను టీడీపీ నేత నాగుల్ మీరా ప్రశ్నించారు. కోట్లాది మంది మహిళల మనోభావాల కంటే డర్టీ ఎంపీనే మీకు ఎక్కువయ్యారా? అని మండిపడ్డారు. సొంతంగా చేసిన నేరాలను సమర్థించుకునేందుకు జగన్ ఒక గ్యాంగును రెడీ చేసుకుంటున్నారని విమర్శించారు. జగన్ వైఖరి వల్లే మాఫియాలు, కిరాతకులు చెలరేగిపోతున్నారని అన్నారు. 

గోరంట్ల మాధవ్ గలీజు వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్, పంజాబ్ ఎంపీ స్పందించినా... జగన్ మాత్రం స్పందించలేదని చెప్పారు. నేరస్తులను కాపాడేందుకు కులాలను రెచ్చగొట్టే స్థాయికి దిగజారారని దుయ్యబట్టారు. జగన్ కు నిజంగా మహిళలపై చిత్తశుద్ధి ఉంటే గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి ఆయనను తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పారు. మాధవ్ పై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ కు కూడా లేఖ రాయాలని అన్నారు.