'లైగర్' నుంచి కోకా సాంగ్ రిలీజ్!

12-08-2022 Fri 18:07
  • 'లైగర్' గా విజయ్ దేవరకొండ 
  • కథానాయికగా అనన్య పాండే పరిచయం 
  • మాస్ లుక్ తో కనిపించనున్న రమ్యకృష్ణ 
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల
Liger Song Released
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందింది. బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 

'కొనిస్తనే కోకా కోకా కోకా' అంటూ ఈ పాట సాగుతోంది. విజయ్ దేవరకొండ - అనన్య పాండే బృందంపై ఈ పాటను చిత్రీకరించారు. పంజాబీ సాంగ్ తరహాలో..  మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సాహిత్యంతో ఈ పాట సాగింది. అనన్య పాండే గ్లామర్ టచ్ తో బీట్ ఆకట్టుకునేలా ఉంది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన  పాత్రను పోషించింది. మకరంద్ దేశ్ పాండే ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో మైక్ టైసన్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.