Telangana: మునుగోడు టీఆర్ఎస్‌లో ముస‌లం... కూసుకుంట్ల‌కు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేత‌ల తీర్మానం

  • కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం
  • చౌటుప్ప‌ల్‌లో భేటీ అయిన టీఆర్ఎస్ స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు
  • కూసుకుంట్ల‌కు టికెట్ ఇస్తే ప‌నిచేసేది లేద‌ని వెల్ల‌డి
trs munugodu leaders opposes kusukuntla prabhakar reddy candidature for bypoll

కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ టికెట్ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ స్థానంలో తిరిగి స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ భావిస్తుండ‌గా... బీజేపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగి త‌న పట్టు నిలుపుకోవాల‌ని కోమ‌టిరెడ్డి వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ రెండు పార్టీల‌కు షాకిస్తూ మునుగోడు ఉప ఎన్నిక‌ను గెల‌వ‌డం ద్వారా త్వ‌ర‌లో రానున్న అసెంబ్లీ ఎన్నిక‌లకు వెళ్లాల‌ని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది.

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి సెగ రాజుకుంది. మునుగోడు ప‌రిధిలోని స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు చౌటుప్ప‌ల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉప ఎన్నిక‌ల్లో కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికి టికెట్ ఇవ్వ‌రాద‌ని వారంతా ఓ తీర్మానాన్ని ఆమోదించారు. కూసుకుంట్ల‌కు టికెట్ ఇస్తే తాము పార్టీ విజ‌యం కోసం ప‌నిచేసేది లేద‌ని కూడా వారు తేల్చి చెప్పారు. ఈ నెల 20న మునుగోడు భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని పార్టీ అధినాయ‌క‌త్వం భావిస్తున్న త‌రుణంలో ఈ ప‌రిణామం చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News