ఏపీలోని డిస్కమ్ లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి: టీడీపీ నేత పట్టాభి

12-08-2022 Fri 17:49
  • జనాలను ఏపీ ప్రభుత్వం విపరీతంగా బాదేస్తోందన్న పట్టాభి 
  • విద్యుత్ ఛార్జీల పేరుతో ఇప్పటికే రూ. 20 వేల కోట్లు బాదేశారని విమర్శ 
  • విద్యుత్ డిస్కమ్ లను ప్రభుత్వం నాశనం చేసిందన్న పట్టాభి 
Pattabhi fires on Jagan
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి విమర్శలు గుప్పించారు. జనాలను వైసీపీ ప్రభుత్వం విపరీతంగా బాదేస్తోందని అన్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పేరుతో రూ. 20 వేల కోట్లు బాదారని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో ఒకవైపు బటన్ నొక్కుతున్న జగన్... మరోవైపు చార్జీల పేరుతో వెనక్కి లాగేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని విద్యుత్ డిస్కమ్ లను జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని... అన్ని డిస్కమ్ లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పారు. ఏపీ డిస్కమ్ లు రూ. 38,836 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని అన్నారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని చెప్పారు.