వరుసగా నాలుగో వారాన్ని లాభాల్లో ముగించిన మార్కెట్లు

12-08-2022 Fri 15:56
  • 130 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 39 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.26 శాతం లాభపడ్డ ఎన్టీపీసీ
Markets ends in profits for straight fourth week
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా నాలుగో వారాన్ని లాభాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 59,462కి చేరుకున్నాయి. నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 17,698 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.26%), టాటా స్టీల్ (3.25%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.93%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.80%), రిలయన్స్ (1.64%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.56%), మారుతి (-1.33%), ఎల్ అండ్ టీ (-1.25%), టెక్ మహీంద్రా (-0.94%), సన్ ఫార్మా (-0.92%).