నా తోడబుట్టిన అన్నతో పాటు దేవుడిచ్చిన ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు: వైఎస్ షర్మిల

12-08-2022 Fri 15:55
  • రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన షర్మిల
  • కొడంగల్ నియోజకవర్గంలో పర్యటన
  • కార్యకర్తలకు రాఖీలు కట్టిన వైనం
YS Sharmila extends Raksha Bandhan wishes
రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. నా తోడబుట్టిన అన్నతో పాటు, నా ప్రజాప్రస్థాన పాదయాత్రలో 1,600 కిలోమీటర్లకు పైగా నాతో నడిచి, నాకు దేవుడిచ్చిన తోబుట్టువుల్లాగా రక్షణగా నిలిచిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ షర్మిల ట్వీట్ చేశారు. షర్మిల ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గ నేతలకు, కార్యకర్తలకు ఆమె రాఖీలు కట్టారు.