తమ్ముడూ...వెళ్లి బ్యాటు, బాలు ఆడుకో పో!: రిషబ్ పంత్ కు ఊర్వశి రౌతేలా కౌంటర్

12-08-2022 Fri 15:37
  • పంత్, రౌతేలా మధ్య సోషల్ మీడియా వార్
  • పంత్ తన కోసం 10 గంటలు వేచిచూశాడన్న రౌతేలా
  • అక్కా... నా వెంటపడొద్దంటూ పంత్ రిప్లయ్
  • ఇన్ స్టాగ్రామ్ లో స్పందించిన రౌతేలా
Urvasi Rautela replies to Rishabh Pant deleted post
టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్, బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మధ్య సోషల్ మీడియాలో వ్యాఖ్యల పరంపర నడుస్తోంది. ఓసారి తన ఇంటికి వచ్చిన రిషబ్ పంత్ తనకోసం 10 గంటల పాటు వేచిచూశాడని, షూటింగ్ లో అలసిపోయి ఉండడంతో తాను అతడ్ని కలవలేకపోయానంటూ రౌతేలా చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. 

అందుకు పంత్ బదులిస్తూ, అక్కా... నా వెంట పడొద్దు అంటూ కౌంటర్ ఇచ్చాడు. "చాలామంది పేరుప్రతిష్ఠల కోసం వెంపర్లాడుతుంటారు. తుచ్ఛమైన పాప్యులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో అబద్ధాలు చెబుతుంటారు" అంటూ రౌతేలాకు చురక అంటించాడు. ఆపై తన ట్వీట్ ను డిలీట్ చేశాడు.

అందుకు రౌతేలా స్పందిస్తూ, "చోటు భయ్యా.... వెళ్లి బ్యాటు, బాలు ఆడుకో పో" అంటూ బదులిచ్చింది. "నువ్వో పిల్లాడివి... నీవల్ల నేను సిగ్గుపడాల్సిందేమీ ఉండదు" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అమ్మాయిలు మౌనంగా ఉన్నారని అలుసుగా తీసుకోవద్దు అంటూ హితవు పలికింది. అంతేకాదు, రక్షాబంధన్ శుభాకాంక్షలు కూడా తెలిపింది.
.