twin towers: నోయిడాలోని 40 అంతస్తుల జంట టవర్లను కూల్చేందుకు 3500 కిలోల పేలుడు పదార్థాలు

  • నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల ఎత్తులో కట్టిన నిర్మాణం
  • ముందుగా ఈ నెల 21వ తేదీనే కూల్చాలని గడువు
  • అధికారుల విజ్ఞప్తి మేరకు 28వ తేదీకి గడువు 
    పొడిగించిన సుప్రీంకోర్టు 
Noida Twin Towers Demolition On August 28 Supreme Court Extends Deadline

నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల ఎత్తులో కట్టిన 40 అంతస్తుల జంట టవర్లను ఈ నెల 28వ తేదీన కూల్చివేయనున్నారు. ఈ టవర్లను ముందుగా ఈ నెల 21న కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా కూల్చివేత డెడ్ లైన్ ను వారం రోజులు పొడిగించింది. మొత్తం ప్రక్రియను సెప్టెంబర్ 4వ తేదీ లోగా పూర్తి చేయాలని నోయిడా అథారిటీని ఆదేశించింది. 
దివాలా తీసిన సూపర్‌ టెక్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మించిన ఈ టవర్స్ ను కూల్చేందుకు మరికొంత గడువు కావాలని నోయిడా అధికారులు కోర్టును కోరారు. వారి విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. 

అంతకుముందు రోజే పేలుడు పదార్థాలతో ఈ  జంట టవర్లను నేలమట్టం చేయడానికి సుప్రీం కోర్టు నియమించిన సాంకేతిక నిపుణుడు ఆమోదం తెలిపాడు. ఈ నెల 28వ తేదీనే కూల్చివేత చేపట్టాలని చెప్పినప్పటికీ.. ఏదైనా సాంకేతిక లోపాలు, వాతావరణ సంబంధిత సమస్యల ఏర్పడితే కూల్చివేత పూర్తి చేసేందుకు వారం రోజుల బఫర్ టైమ్ ఇచ్చింది. జంట టవర్ల కూల్చివేతకు 3,500 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. 

వీటిని టవర్ల పిల్లర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో చేసిన 9,400 రంధ్రాల్లో నింపుతామన్నారు. రియల్ ఎస్టేట్ దిగ్గజం సూపర్‌టెక్ నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చివేయాలని గత ఏడాది ఆగస్టు 31న సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ టవర్లలో 900 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి.

More Telugu News