Dwayne Bravo: అత్యధిక వికెట్ల వీరుడిగా డ్వేన్ బ్రావో రికార్డు

Dwayne Bravo becomes first cricketer to take 600 wickets in T20s
  • టీ20 ల్లో అత్యధికంగా వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా బ్రావోకు గుర్తింపు
  • ఓవల్ ఇన్విసిబుల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘనత 
  • బ్రావో ఖాతాలో 600 వికెట్లు 
  • ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్ లలో ఆడిన నేపథ్యం

వెస్టిండీస్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన డ్వేన్ బ్రావో మరో మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. చరిత్రలో టీ20ల్లో 600 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. శుక్రవారం ఓవల్ ఇన్విసిబుల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత బ్రావో సొంతమైంది. 

బ్రావో తర్వాత ఆప్ఘానిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 466 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తం 339 మ్యాచులలో అన్ని వికెట్లు తీశాడు. డ్వేన్ బ్రావో వెస్టిండీస్ తరఫున టీ20ల్లో 91 మ్యాచులకు గాను 78 వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన వికెట్లను దేశీయ మ్యాచులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో లీగ్ ల తరఫున ఆడి గెలుచుకున్నవి. ఇప్పటి వరకు తన కెరీర్ లో బ్రావో 25 జట్లకు ప్రాతిధ్యం వహించాడు. వెస్టిండీస్ కు టీ20 కప్ సాధించి పెట్టిన అనంతరం బ్రావో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం తెలిసిందే.

  • Loading...

More Telugu News