రక్షాబంధన్ వేళ.. సోదరి ప్రియాంక గాంధీతో తన అనుబంధాన్ని పంచుకున్న రాహుల్ గాంధీ

12-08-2022 Fri 09:40
  • రక్షా బంధన్ ఫొటోలను షేర్ చేసిన రాహుల్ గాంధీ
  • బాల్యం నుంచి ఒకరికొకరం తోడుగా నిలిచామన్న రాహుల్
  • కష్టసుఖాల్లో అండగా ఉన్నామన్న కాంగ్రెస్ అగ్రనేత
Rahul Gandhi Shares pictures with sister priyanka gandhi on the eve of Raksha Bandhan
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ను దేశం మొత్తం ఉత్సాహంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సోదరి ప్రియాంక గాంధీతో తనకున్న అనుబంధాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటి వరకు జరుపుకున్న రక్షాబంధన్ నాటి ఫొటోలను రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 

చిన్నప్పటి నుంచి వారి మధ్య పెనవేసుకున్న అనుబంధానికి ఆ చిత్రాలు నిలువుటద్దంలా కనిపిస్తున్నాయి. బాల్యం నుంచి ఇద్దరం ఒకరికొకరం తోడుగా నిలిచామని, కష్టసుఖాల్లో అండగా ఉంటూ ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నామని ఈ సందర్భంగా రాహుల్ రాసుకొచ్చారు. ఈ బంధం శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు.