Telangana: చీకోటి ప్ర‌వీణ్‌కు భ‌ద్ర‌త క‌ల్పించండి... హైద‌రాబాద్ పోలీసుల‌కు హైకోర్టు ఆదేశం

ts high orders hyderabad police to give security to cheeoti praveen
  • అక్ర‌మ లావాదేవీల‌కు పాల్ప‌డ్డారంటూ ప్ర‌వీణ్‌పై ఆరోప‌ణ‌లు
  • ఇప్ప‌టికే ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన ప్ర‌వీణ్‌
  • త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించిన వైనం
  • గురువారం ప్ర‌వీణ్ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు
  • వారంలోగా ప్ర‌వీణ్ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోర్టు ఆదేశం
క్యాసినో వ్య‌వ‌హారంలో అక్ర‌మ లావాదేవీల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చీకోటి ప్ర‌వీణ్‌కు భ‌ద్ర‌త క‌ల్పించే విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని తెలంగాణ హైకోర్టు గురువారం హైద‌రాబాద్ పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అక్ర‌మ లావాదేవీల వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే చీకోటి ప్ర‌వీణ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విచారించిన సంగ‌తి తెలిసిందే.

విచార‌ణ‌లో భాగంగా ప‌లువురు రాజకీయ నేత‌ల పేర్ల‌ను తాను ఈడీ అధికారుల‌కు వెల్ల‌డించిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, ఈ క్ర‌మంలో త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని, త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పోలీసులను ఆదేశించాల‌ని కోరుతూ ప్ర‌వీణ్ ఈ నెల 4న హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌తో పాటు త‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆయ‌న త‌న పిటిష‌న్‌లో కోర్టును అభ్య‌ర్థించారు. ఈ పిటిష‌న్‌పై గురువారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ప్ర‌వీణ్ విజ్ఞ‌ప్తిని వారంలోగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని హైద‌రాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Telangana
Casino
Enforcement Directorate
TS High Court
Cheekoti Praveen

More Telugu News