కుమారుడితో క‌లిసి జ‌గ‌న్‌ను క‌లిసిన అవంతి శ్రీనివాస్‌.. ఫొటో ఇదిగో

11-08-2022 Thu 19:01
  • అవంతికి కుమారుడు నందేశ్‌తో పాటు కూతురు ప్రియాంక‌
  • అవంతి గ్రూప్ వైస్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్న నందేశ్‌
  • కుమారుడిని వెంట‌బెట్టుకుని రావ‌డంతో నెలకొన్న ఆస‌క్తి ‌
avanthi srinivas met cm ys jagan with his son nandesh
మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస రావు అలియాస్ అవంతి శ్రీనివాస్ గురువారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. జ‌గ‌న్‌తో భేటీ కోసం ఆయ‌న అవంతి గ్రూప్ వైస్ చైర్మన్‌గా కొన‌సాగుతున్న త‌న కుమారుడు ముత్తంశెట్టి శివ నందేశ్‌ను వెంట‌బెట్టుకుని వ‌చ్చారు. నందేశ్‌తో పాటు అవంతి గ్రూప్ ఎండీగా కొన‌సాగుతున్న శ్రావ‌ణ్ కుమార్‌ను కూడా ఆయ‌న త‌న వెంట తీసుకెళ్లారు. 

అవంతి వార‌సుడిగా నందేశ్ ఇప్ప‌టిదాకా అస‌లు బ‌య‌ట‌కే రాలేద‌నే చెప్పాలి. అవంతి గ్రూప్ పేరిట కుటుంబ వ్యాపారాల‌ను చూసుకుంటున్న నందేశ్‌... తాజాగా సీఎం జ‌గ‌న్‌తో భేటీకి రావ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. అవంతి శ్రీనివాస్‌కు నందేశ్‌తో పాటు ప్రియాంక అనే కూతురు కూడా ఉన్నారు.