Bihar: ఈ నెల 24న బ‌ల ప‌రీక్ష‌కు సిద్ధం కండి... నితీశ్ కుమార్‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్ ఆదేశం

bihar governor orders nitish kumar for floor test
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో తెగ‌దెంపులు చేసుకుని కొత్త‌గా కాంగ్రెస్‌, ఆర్జేడీతో జ‌ట్టు క‌ట్టిన జేడీయూ అధినేత‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ నెల 24న ఆ రాష్ట్ర అసెంబ్లీలో త‌న బ‌లాన్ని నిరూపించుకోనున్నారు. ఈ మేర‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్ ఫ‌గ్గూ చౌహాన్ గురువారం కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24 నూత‌న స‌ర్కారు త‌న బ‌లాన్ని నిరూపించుకోవాల‌ని ఆయ‌న సీఎం నితీశ్‌కు సూచించారు. 

గ‌డ‌చిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్జేడీతోనే ముందుకు సాగిన నితీశ్... ఆ త‌ర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తాజాగా బీజేపీని వీడిన ఆయ‌న తిరిగి ఆర్జేడీతో పాటు కాంగ్రెస్‌, మ‌రో 5 పార్టీల‌తో పొత్తు పెట్టుకున్నారు. త‌న‌కు మెజారిటీ ఎమ్మెల్యేల బల‌ముంద‌ని గ‌వర్న‌ర్‌కు తెలిపిన నితీశ్... బుధ‌వారం ఆర్జేడీ అగ్ర నేత తేజ‌స్వీ యాద‌వ్‌తో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా గ‌వర్న‌ర్ ఆదేశాల‌తో ఈ కొత్త ప్ర‌భుత్వం ఈ నెల 24న త‌న బ‌లాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.
Go Back to Shorts
Bihar
Nitish Kumar
Tejashwi Yadav
JDU
RJD
BJP

More Telugu News