కోడ‌లిని న‌రికి చంపి... త‌ల‌తో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన అత్త‌

11-08-2022 Thu 15:45
  • అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటి మండ‌లం కె.రామాపురంలో ఘ‌ట‌న‌
  • కోడ‌లు వ‌సుంధ‌ర‌ను చంపేసిన అత్త సుబ్బ‌మ్మ‌
  • కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మ‌ని వెల్ల‌డించిన హంత‌కురాలు
mother in law kills niece in annamayya district
ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. కోడ‌లి త‌లన‌రికి చంపిన అత్త... ఆ త‌ర్వాత కోడ‌లి త‌ల‌ను చేతిలో ప‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయింది. అంతేకాకుండా త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశానంటూ పోలీసుల ఎదుట నిర్భ‌యంగా నేరాన్ని ఒప్పుకుంది. 

ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకెళితే... జిల్లాలోని రాయ‌చోటి మండ‌లం కె.రామాపురంలో సుబ్బ‌మ్మ నివ‌సిస్తోంది. కోడ‌లు వ‌సుంధ‌ర (35)తో ఆమెకు గ‌త కొంత‌కాలంగా కుటుంబ క‌ల‌హాలు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో గురువారం ఆవేశంతో ఊగిపోయిన సుబ్బ‌మ్మ‌... కోడ‌లు వ‌సుంధ‌ర‌పై దాడికి దిగింది. క‌త్తి తీసుకుని వ‌సుంధ‌ర త‌ల న‌రికేసింది. 

ఆ వెంటనే, తెగి ప‌డిన వ‌సుంధ‌ర త‌ల‌ను చేత బ‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లింది. త‌న కోడ‌లిని తానే హ‌త్య చేశాన‌ని పోలీసుల‌కు చెప్పింది. కోడ‌లి త‌ల‌తో సుబ్బ‌మ్మ అలా న‌డుచుకుంటూ వెళుతుంటే... జ‌నం బెంబేలెత్తిపోయారు.