Chandrababu: చంద్రబాబు బినామీ ఏబీఎన్ రాధాకృష్ణ: నారాయణ స్వామి

Narayana Swamy comments on Chandrababu and ABN Radhakrishna
  • చంద్రబాబు, రాధాకృష్ణ ఇద్దరూ దొంగలేనన్న డిప్యూటీ సీఎం 
  • గోరంట్ల మాధవ్ పై ఫేక్ వీడియో ప్రసారం చేశారని వెల్లడి 
  • తనపై కూడా తప్పుడు కథనాలను ప్రసారం చేశారన్న నారాయణ స్వామి 
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బినామీ రాధాకృష్ణ అని ఆరోపించారు. వీరిద్దరూ దొంగలేనని అన్నారు. తమ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఫేక్ వీడియో క్రియేట్ చేసి, ప్రసారం చేశారని మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ పని చేశారని చెప్పారు. చంద్రబాబుతో కలిసి రాధాకృష్ణ ఎన్ని కుట్రలు చేసినా ఉపయోగం ఉండదని అన్నారు. తన గురించి కూడా ఏబీఎన్ లో తప్పుడు కథనాలను ప్రసారం చేశారని విమర్శించారు. బీసీలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Chandrababu
Telugudesam
Radhakrishna
K Narayana Swamy
YSRCP

More Telugu News