అమ్మకాల్లో ‘టాటా పంచ్’ రికార్డులు

11-08-2022 Thu 14:21
  • పది నెలల్లోనే లక్ష వాహనాల తయారీ
  • ఎస్ యూవీ విక్రయాల్లో సరికొత్త రికార్డు
  • ఒక్క జులై నెలలోనే 11,007 యూనిట్ల అమ్మకాలు
Tata Punch becomes fastest SUV to hit one lakh sales milestone in India
టాటా మోటార్స్ కు చెందిన చిన్నపాటి ఎస్ యూవీ వాహనం ‘పంచ్’ రికార్డులు సృష్టిస్తోంది. విడుదల చేసిన పది నెలల్లోనే లక్ష వాహనాల ఉత్పత్తి మైలురాయిని టాటా మోటార్స్ చేరుకుంది. లక్షవ పంచ్ వాహనాన్ని తయారు చేసి డీలర్లకు పంపినట్టు కంపెనీ ప్రకటించింది. అతి తక్కువ కాలంలో అత్యధిక ఎస్ యూవీలను విక్రయించడంలో పంచ్ రికార్డు నమోదు చేసింది. 

అంతర్జాతీయ క్రాష్ టెస్ట్ లో ఐదు స్టార్లు సంపాదించిన పంచ్ వాహనానికి మంచి డిమాండ్ వస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. అంటే వాహనానికి, వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ఎక్కువ భద్రత ఉంటుందన్న దానికి ఈ రేటింగ్ నిదర్శనం. 2021 అక్టోబర్ లో టాటా మోటార్స్ పంచ్ ను విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా విక్రయమవుతున్న టాప్ 10 కార్లలో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది ఒక్క జులైలోనే 11,007 యూనిట్లు అమ్ముడుపోయాయి.