మోదీకి రాఖీ కట్టిన స్వీపర్లు, ప్యూన్లు, డ్రైవర్ల కూతుళ్లు

11-08-2022 Thu 14:15
  • తన సిబ్బంది పిల్లలకు అరుదైన అవకాశం కల్పించిన ప్రధాని
  • చిన్నారులతో జరుపుకున్న ఈ పండుగ ప్రత్యేకం అన్న మోదీ
  • దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని
Daughters Of Staff Members At PMs Office Tie Him Rakhi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షా బంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని సిబ్బంది కుమార్తెలు అయిన చిన్నారులు ఆయన చేతికి రాఖీ కట్టారు. ప్రధానమంత్రి ఇంటి వద్ద జరిగిన ఈ ప్రత్యేక రక్షా బంధన్ వేడుకలో పాల్గొన్న వారిలో స్వీపర్లు, ప్యూన్లు, తోటమాలి, డ్రైవర్లు, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో పనిచేస్తున్న ఇతరుల కుమార్తెలు ఉన్నారు. 

రాఖీ కట్టిన చిన్నారులతో మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. చిన్నారులతో జరుపుకున్న ఈ రక్షా బంధన్ చాలా ప్రత్యేకమైనదని అన్నారు. అంతకుముందు రక్షా బంధన్ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.