Gotabaya Rajapaksa: సింగపూర్ నుంచి థాయ్ లాండ్ కు వెళ్లనున్న గొటబాయ రాజపక్స

  • ముగుస్తున్న గొటబాయ సింగపూర్ వీసా గడువు
  • ఆశ్రయం ఇవ్వాలని థాయ్ లాండ్ ను కోరిన గొటబాయ
  • మానవతా దృక్పథంతో ఓకే చెప్పిన థాయ్ లాండ్
Gotabaya Rajapaksa going to Thailand from Singapore

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం నుంచి పరారైన సంగతి తెలిసిందే. శ్రీలంక నుంచి మాల్దీవులకు... అక్కడి నుంచి సింగపూర్ కు ఆయన వెళ్లారు. దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన గొటబాయ... దేశ ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక జులై 13న స్వదేశాన్ని విడిచి వెళ్లారు. సింగపూర్ ఆయనకు తాత్కాలిక ఆశ్రయాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆయనకు ఇచ్చిన వీసా గడువు ముగుస్తుండటంతో... తనకు ఆశ్రయమివ్వాలని థాయ్ లాండ్ ను కోరారు. ఆయన విన్నపం పట్ల థాయ్ లాండ్ సానుకూలంగా స్పందించింది. ఆశ్రయమిచ్చేందుకు ఓకే చెప్పింది. 

అయితే, కేవలం మానవతా దృక్పథంతోనే తాత్కాలికంగా తమ దేశంలో ఉండేందుకు అవకాశం ఇస్తున్నామని థాయ్ లాండ్ తెలిపింది. తమ దేశంలో ఉంటూ రాజకీయ కార్యకలాపాలను నిర్వహించకూడదని షరతు విధించింది. గొటబాయ రాజపక్సకు థాయ్ లాండ్ ప్రధాని ప్రయూత్ అనుమతిని ఇచ్చినట్టు బ్యాంకాక్ పోస్ట్ పత్రిక వెల్లడించింది.

More Telugu News