వెంక‌య్య‌ను క‌లిసి శుభాభినంద‌న‌లు తెలిపిన విజ‌య‌ సాయిరెడ్డి

10-08-2022 Wed 21:30
  • ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వెంక‌య్య‌
  • వెంక‌య్య‌ను స్వ‌యంగా వెళ్లి క‌లిసిన సాయిరెడ్డి
  • వెంక‌య్య ప‌నితీరును ఆకాశానికెత్తేసిన వైసీపీ ఎంపీ
ysrcpp leader vijay sai reddy lauded venkaiah naidu as vice president of inida
భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్యనాయుడిని వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి బుధ‌వారం స్వ‌యంగా వెళ్లి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఉప‌రాష్ట్రప‌తిగా వెంక‌య్య ప‌నితీరును సాయిరెడ్డి కీర్తించారు. బుధ‌వారం నుంచి నూత‌న జీవితాన్ని ప్రారంభించిన వెంక‌య్య‌కు దేవుడు ఆయురారోగ్యాల‌ను ప్ర‌సాదించాల‌ని ఈ సంద‌ర్భంగా సాయిరెడ్డి ఆకాంక్షించారు.

రాజ్య‌స‌భ‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాదుకొల్పడంలో వెంక‌య్య స‌ఫ‌లీకృతం అయ్యార‌ని సాయిరెడ్డి పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో స‌భా సంఘాల ప‌నీతీరును మెరుగు ప‌ర‌చ‌డంతో పాటుగా రాజ్య‌స‌భ‌లో అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌లు జ‌రిగేలా వెంక‌య్య చేసిన కృషి అభినంద‌నీయ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.