బౌల్ట్, డికాక్ వంటి ఆటగాళ్లు టెస్టులకు దూరం కావడంపై ఐసీసీ దృష్టి సారించాలి: విజయసాయిరెడ్డి

10-08-2022 Wed 20:12
  • టీ20 క్రికెట్ అంటే అందరికీ ఇష్టమేనన్న విజయసాయి
  • అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టులకు దూరమవుతున్నారని వ్యాఖ్య 
  • ఐసీసీ చర్యలు తీసుకోవాలని సూచన
Vijayasai Reddy opines in Cricket issues
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయేతర అంశాలపై స్పందించడం అరుదైన విషయమే. తాజాగా ఆయన అంతర్జాతీయ క్రికెట్ తీరుతెన్నులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. టీ20 క్రికెట్ అంటే అందరికీ ఇష్టమేనని, అయితే ఈ ఫార్మాట్ కారణంగా ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్ వంటి పేరుమోసిన ఆటగాళ్లు టెస్టు క్రికెట్ కు దూరవుతున్నారని విజయసాయిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. 

ఈ అంశంపై ఐసీసీ దృష్టి సారించాలని సూచించారు. స్వచ్ఛమైన క్రికెట్ కు ప్రతిరూపమైన టెస్టు ఫార్మాట్ కు అగ్రశ్రేణి ఆటగాళ్లు అందుబాటులో ఉండే విధంగా ఐసీసీ చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. తద్వారా క్రికెట్ వినోదం పదిలంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు.