హైద‌రాబాద్‌లో విదేశాంగమంత్రి... పాస్‌పోర్టు కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన జైశంకర్

10-08-2022 Wed 20:01
  • హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర మంత్రి జై శంక‌ర్‌
  • పాస్‌పోర్టు కార్యాల‌య సిబ్బందితో గ్రూప్ ఫొటో
  • మెరుగైన సేవలు అందిస్తున్నార‌ని కితాబు
union minister jaishankar visited hyderabad Regional Passport Office
భార‌త విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ బుధ‌వారం హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌గ‌రంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ కార్యాల‌యం ద్వారా ప్ర‌జ‌ల‌కు అందుతున్న సేవ‌లు, ప్ర‌జ‌లకు మెరుగైన సేవలు అందించేందుకు పాస్‌పోర్ట్ కార్యాల‌యం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఆయ‌న స‌మీక్షించారు. 

ఈ సంద‌ర్భంగా పాస్‌పోర్టు కార్యాల‌యం సిబ్బందితో గ్రూప్ ఫొటో దిగిన జై శంక‌ర్‌... పాస్‌పోర్టు కార్యాల‌య సిబ్బందితో ముచ్చ‌టించారు. పౌరుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్నార‌ని ఆయ‌న సిబ్బందిని మెచ్చుకున్నారు. మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న సిబ్బందికి పిలుపునిచ్చారు.