నారా లోకేశ్ పాత ఫొటోలను షేర్ చేస్తూ వైసీపీ నేత ఎదురు దాడి

10-08-2022 Wed 19:53
  • విదేశీ మ‌హిళ‌ల‌తో క‌లిసి ఉన్న నారా లోకేశ్
  • గ‌తంలోనే బ‌య‌టకొచ్చిన ఫొటోల‌ను తాజాగా పోస్ట్ చేసిన నాగార్జున యాద‌వ్‌
  • అశ్లీలతకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అంటూ ఆరోప‌ణ‌
ysrcp Official Spokesperson Nagarjuna Yadav tweets with nara lokesh old photos
ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న‌ట్లుగా ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియోపై జ‌రుగుతున్న ర‌చ్చ‌లో భాగంగా బుధ‌వారం సాయంత్రం వైసీపీ అధికార ప్ర‌తినిధి నాగార్జున యాద‌వ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. విదేశీ మ‌హిళ‌ల‌తో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ క‌లిసి ఉన్న ఫొటోల‌ను అందులో పోస్ట్ చేసిన నాగార్జున‌... అశ్లీలతకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అంటూ కామెంట్ చేశారు.

ఒకరు కాదు.. నలుగురైదుగురు మహిళలతో విదేశాల్లో నారా లోకేశ్‌ చేసిన రాసలీలలు, శృంగార కార్యకలాపాలు బాబుకుగానీ, ఆ పార్టీ మహిళా నేతలకుగానీ అశ్లీలతగా కనిపించలేదా? అని త‌న ట్వీట్‌లో నాగార్జున ప్ర‌శ్నించారు. మహిళలతో లోకేశ్‌ విశృంఖలతకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇవి అంటూ ఆయ‌న పేర్కొన్నారు.