జ‌ర్న‌లిస్టుల‌కు వెంక‌య్య తెలుగింటి విందు... ఫొటోలు ఇవిగో

10-08-2022 Wed 18:06
  • ఉప‌రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో విందు
  • జ‌ర్న‌లిస్టుల‌తో క‌లిసి భోజనం చేసిన వెంక‌య్య‌
  • మీడియా ప్ర‌తినిధుల‌తో త‌న బంధాన్ని గుర్తు చేసుకున్న వైనం
Venkaiah Naidu hosted a traditional Telugu lunch for journalists
భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు బుధ‌వారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఢిల్లీలోని ఆయా మీడియా సంస్థ‌ల‌కు చెందిన జ‌ర్న‌లిస్టుల‌కు త‌న అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు. అచ్చ‌మైన తెలుగింటి భోజ‌నాన్ని ఆయ‌న మీడియా ప్ర‌తినిధుల‌కు వ‌డ్డించారు. ఈ సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన వెంక‌య్య‌... వారితో క‌లిసి ఫొటోలు దిగారు. జ‌ర్న‌లిస్టులతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.