'ఇండియన్ పోలీస్ ఫోర్స్' షూటింగ్ లో కాలు విరిగింది: శిల్పా శెట్టి

10-08-2022 Wed 17:42
  • రోహిత్ శెట్టి దర్శకత్వంలో వెబ్ సిరీస్
  • షూటింగ్ లో గాయపడిన శిల్పా శెట్టి
  • 6 వారాలు విశ్రాంతి
  • నాకోసం ప్రార్థించండి అంటూ శిల్పా విజ్ఞప్తి
Shilpa Shetty broken her leg in Indan Police Force web series shooting
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి షూటింగ్ లో గాయపడింది. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ లో శిల్పాతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఓబెరాయ్, ఇషా తన్వర్ తదితరులు నటిస్తున్నారు. అయితే, షూటింగ్ లో శిల్పా శెట్టి కాలు విరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తనే స్వయంగా వెల్లడించింది. ఆసుపత్రిలో వీల్ చెయిర్ లో కూర్చుని ఉన్న ఫొటోను కూడా శిల్పా షేర్ చేసింది. 

"వాళ్లు రోల్, కెమెరా, యాక్షన్ అన్నారు... అంతే... నా కాలు విరిగిపోయింది. తప్పదు, బాధ వచ్చినప్పుడు బాధపడాల్సిందే. గాయం కారణంగా 6 వారాల పాటు షూటింగ్ కు దూరం కావాల్సి వస్తోంది. అయితే మరింతగా పుంజుకుని తిరిగి వస్తాను. నాకోసం మీరు ప్రార్థిస్తారు కదూ! ప్రార్థనలు ఎప్పుడూ ఫలిస్తాయి" అంటూ శిల్పాశెట్టి ఇన్ స్టాగ్రామ్ లో వివరించింది.
.