ఆ వీడియో ఫేక్ అని ఎలా తేల్చారో ఎస్పీ చెప్పాలి: నారా లోకేశ్

10-08-2022 Wed 17:19
  • మీడియా ముందుకు వ‌చ్చిన లోకేశ్
  • ఒరిజిన‌ల్ ఉంద‌ని ఎస్పీ భావిస్తున్నారా? అని ప్ర‌శ్నించిన టీడీపీ నేత‌
  • ఏ ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందో ఎస్పీ బ‌య‌ట‌పెట్టాలని డిమాండ్‌
nara lokesh comments on ananthapur sp pressmeet over ysrcp mp gorantla madhav video
ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న‌ట్లుగా క‌నిపిస్తున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు చెందిన‌దిగా వైర‌ల్ అవుతున్న వీడియో ఒరిజిన‌ల్ కాదంటూ అనంత‌పురం జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప చేసిన ప్ర‌క‌ట‌న‌పై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ స్పందించారు. ఈ రోజు  మంగ‌ళ‌గిరిలో జరిగిన  మీడియా సమావేశంలో  లోకేశ్ ప‌లు అంశాల‌పై ఎస్పీకి ప్ర‌శ్న‌లు సంధించారు.

ఎంపీ మాధ‌వ్‌కు చెం‌దినదిగా భావిస్తున్న ఆ వీడియో ఫేక్ అని ఎలా తేల్చారో ఎస్పీ ఫ‌కీర‌ప్ప చెప్పాల‌ని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోకు సంబంధించి ఒరిజిన‌ల్ వీడియో అంటూ ఒక‌టి ఉంద‌ని ఎస్పీ భావిస్తున్నారా? అని కూడా లోకేశ్ ప్ర‌శ్నించారు. అయినా ఆ వీడియో ఒరిజిన‌ల్ కాదంటూ ఏ ఫోరెన్సిక్ నివేదిక చెప్పిందో ఎస్పీ బ‌య‌ట‌పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.