Nara Lokesh: నాకు మరో పెళ్లయిందని, సంతోష్ అనే కొడుకు ఉన్నాడని కూడా ఈ దద్దమ్మలు ప్రచారం చేశారు: నారా లోకేశ్

Nara Lokesh slams falls propaganda
  • నేతలు మహిళలను కించపర్చేలా మాట్లాడరాదన్న లోకేశ్ 
  • యువతకు తప్పుడు సందేశం పంపినట్టవుతుందని వెల్లడి
  • తానెప్పుడూ ఆ విధంగా మాట్లాడలేదని కామెంట్  
  • ఏది ఫేక్, ఏది రైట్ అనేది ప్రజలు గమనిస్తుంటారన్న లోకేశ్ 
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ విమర్శనాస్త్రాలు సంధించారు. మహిళలను కించపరిచే విధంగా ప్రజాప్రతినిధులు మాట్లాడడం సరికాదని అన్నారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే, అది సమాజంలోని యువతకు తప్పుడు సందేశం పంపినట్టవుతుందని, అలా మాట్లాడితే తప్పేంటని వారు భావించే ప్రమాదం ఉంటుందని వివరించారు. 

"మా అమ్మ గురించి మాట్లాడితే నేను కూడా మాట్లాడొచ్చు కదా! భారతీ రెడ్డి గారి గురించి మాట్లాడొచ్చు... జగన్ ఇద్దరు కూతుళ్ల గురించి నేను మాట్లాడొచ్చు... కానీ ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడలేదు. 2012 నుంచి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు మరో పెళ్లయిందని, సంతోష్ అనే కొడుకు ఉన్నాడని దుష్ప్రచారం చేశారు. కానీ ఈ దద్దమ్మలు రుజువు చేయలేకపోయారు. వీళ్లకు తెలిసిందల్లా ఆరోపణలు చేయడం, పారిపోవడమే. ఆఖరికి ఇంట్లో దురదృష్టకరమైన ఘటన జరిగితే కూడా దానిపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏది ఫేక్, ఏది రైట్ అనేది ప్రజలు గమనిస్తుంటారు" అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Falls Allegations
Leaders
TDP
Andhra Pradesh

More Telugu News