బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా సునీల్ బ‌న్స‌ల్ నియామ‌కం

10-08-2022 Wed 17:07
  • బీజేపీ యూపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న బ‌న్స‌ల్‌
  • పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా హోదా పెంపు
  • తెలంగాణ స‌హా ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశాల‌కూ ఇంచార్జీ బాధ్యతలు  
  • అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసిన జేపీ న‌డ్డా
Sunil Bansal is the bjp telangana state in charge
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో బీజేపీ ఓ కీల‌క నియామ‌కాన్ని ప్ర‌క‌టించింది. బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సునీల్ బ‌న్స‌ల్‌ను నియ‌మించింది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా బుధ‌వారం సాయంత్రం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ప్ర‌స్తుతం బీజేపీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాఖ ప్ర‌ధాన కార్య‌దర్శిగా కొన‌సాగుతున్న బ‌న్స‌ల్‌కు తాజాగా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి క‌ల్పించారు. అంతేకాకుండా ఆయ‌న‌కు తెలంగాణ పార్టీ శాఖ ఇంచార్జీ బాధ్య‌త‌ల‌తో పాటుగా ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా శాఖ‌ల ఇంచార్జీగానూ నియ‌మించారు.